June 17, 2026 1:24 am

V1News Telangana

ముధోల్ నియోజక వర్గం లో ఆపదలో ఆదుకునే అపద్బాంధవుడు భోస్లే మోహన్ రావ్ పటేల్*

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

*గూడు కోల్పోయిన దేగాం గ్రామానికి చెందిన వడ్డే రాజు గారి కుటుంబానికి అండగా మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్..*

*దేగాం గ్రామానికి చెందిన వడ్డే రాజు కుటుంబానికి తక్షణ సహాయం కింద ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సారుకులు కొంత నగదు ఆందజేత.*

*మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో తాత్కాలికంగా ఉండడానికి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ*

ముధోల్ నియోజక వర్గం భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన వడ్డే రాజు గారి ఇల్లు ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్దం కావడం జరిగింది మరియు ఇంటి లోపల ఉన్న నిత్యావసర సరుకులు, ఇంటిలోని వస్తువులు బంగారం నగదు పూర్తిగా దగ్ధం అయ్యి వడ్డే రాజు గారి కుటుంబం రోడ్డున పడటం తో
ఈ విషయం వివిధ మాధ్యమాల ద్వారా మరియు మండల నాయకుల ద్వారా మరియు దేగాం గ్రామానికి చెందిన గ్రామస్థుల ద్వారా సమాచారం తెలుసుకున్న మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత వడ్డే రాజు కుటుంబీకులను పరామర్శించారు జరిగిన ఘటన పరిశీలించారు. బాధిత కుటుంబీకులను ఘటన పై అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధలో ఉన్న కుటుంబీకులను ఓదార్చారు.బాధిత కుటుంబానికి అండగా ఉండాలనే ఉధ్యేశం తో మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో తక్షణ సహయం క్రింద నిత్యావసర సరుకులు అందించారు మరియు ప్రస్తుత ఖర్చుల నిమిత్తం కొంత నగదు అందించి మానవత్వం చాటుకున్నారు. అంతేకాకుండా మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో వడ్డే రాజు గారి కుటుంబానికి తక్షణమే తాత్కాలికంగా ఉండడానికి ఇంటిని నిర్మించి ఇస్తానని మోహన్ రావ్ పటేల్ గారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోహన్ రావ్ పటేల్ గారు ముధోల్ నియోజకవర్గంలో పేద ప్రజల కోసమే మా ప్రజా ట్రస్ట్ ను స్థాపించామని నిరుపేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ప్రజా ట్రస్ట్ అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని కోరారు.
ముధోల్ నియోజక వర్గంలో ప్రమాదవషాత్తు *(అగ్ని ప్రమాదం,పాముకాటు,షాట్ సర్క్కుట్, పిడుగు పాటు,వరద ప్రమాదం)* అనుకోని సంఘటనలు జరిగితే మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించి బాసటగా ఉంటామని ట్రస్ట్ ఛైర్మెన్ మోహన్ రావ్ పటేల్ గారు తెలిపారు
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మండల నాయకులు మరియు ప్రజా ట్రస్ట్ టీం సభ్యులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more