June 17, 2026 1:22 am

V1News Telangana

అదుపుతప్పి ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

– తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

– నిత్యం దారి పొడవునా పలు ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు

– జాగ్రత్తలు పాటించడంలో విఫలమవుతున్న జాతీయ రహదారుల అధికారులు, గుత్తేదారులు

– అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యపు వైఖరి వలన ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్న రహదారులు

– ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తీవ్రంగా మండిపడుతున్న స్థానికులు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నుండి రుద్రూర్ వరకు చేపడుతున్న ఎన్ హెచ్ 765 డి జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండడంతో వారు సూచిక బోర్డులు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో నసురుల్లాబాద్ మండల పరిధిలోని దుర్కి గ్రామ శివారులో గల ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల వద్ద బాన్సువాడ మండలం, రాంపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ గౌస్ బాన్సువాడ నుండి రాంపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎన్ హెచ్ హైవే పని చేసే వాళ్లు , రోడ్డు వెడల్పు, పనుల్లో భాగంగా రోడ్డుపై నెట్వర్క్ కు సంబంధించిన, వైరు బయటపడటంతో, దాన్ని తొలగించాల్సి ఉంది.. దానిని తొలగించకపోవడంతో రాత్రి సమయంలో అది గమనించక పోవడంతో ద్విచక్ర వాహనానికి తగలడంతో ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోయింది , ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్న జాతీయ రహదారుల అధికారులు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదని ప్రజలు మండిపడుతున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Comment

Read more
Read more