*134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఆవిష్కరన చేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ గారిని అనేక సార్లు అవమానపర్చి, ఆయన ఓటమికి కొన్ని పార్టీలు కారణమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజ్యాంగాలను పరిశీలించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహా మేధావి అంబేద్కర్ అని అన్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దేశ అభివృద్ధికి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఎంతో స్ఫూర్తి దాయకం అని అన్నారు. వారి స్పూర్తి గా ముంబై లో 140అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళిత బిడ్డల కోసం, విదేశాల్లో వారి చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం 56వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. వారి బాటలో నడవాలని, వారి ఆశయాల సాధనకు ప్రతీ ఒక్క భారతీయుడు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, దళిత సంఘాల నాయకులు, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు రాచకొండ సాగర్, బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






