బోధన్, నిజామాబాద్ జిల్లా:
బోధన్ నియోజకవర్గ పరిధిలోని పలు రహస్య ప్రదేశాల్లో పేకాట వందల రూపాయల నుండి వేల రూపాయల వరకు జరిగిపోతుండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బిలాల్ చెరువు సమీపంలో ఉన్న కప్పల మడుగు, పాప నాగమ్మ ప్రదేశం వంటి ప్రాంతాల్లో పేకాట నిర్వహణకు ఇద్దరు స్థానికులు కేంద్ర బిందువుగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా, సాలంపాడు, కుమానపల్లి, నాగంపల్లి వంటి గ్రామాల పంట శివార్లు, సాలూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న దాబాల చుట్టూ కూడా రహస్యంగా పేకాట ఆడుతూ కనిపిస్తున్నారని సమాచారం.
రాత్రివేళల్లో క్యాష్ డీలింగ్ – భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
స్థానికుల చెబుతున్న వివరాల ప్రకారం, ఈ పేకాటకు కొన్ని రాజకీయ బ్యాకింగ్ ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణమని వాదిస్తున్నారు.

ఐపీఎల్ బెట్టింగ్తో తీవ్రంగా నష్టపోతున్న ప్రజలు
ఐపీఎల్ క్రికెట్ సీజన్ నడుస్తున్న ఈ సమయంలో, కొందరు యువకులు మొబైల్ షాపులు, కిరాణా షాపులు, బెల్ట్ షాపుల్లో రహస్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్ కు అలవాటుపడుతున్నారు. డబ్బులు కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బాధితులు వాపోతున్నారు.
ప్రజల డిమాండ్:
పేకాట, బెట్టింగ్ మాఫియాలపై చర్యలు తీసుకోవాలని, గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఈ అక్రమ కార్యకలాపాలకు చెక్ వేయాలని ప్రజలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






