నిజామాబాద్, ఏప్రిల్ 13:వేసవి సెలవుల సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ శాఖ మహిళా విద్యార్థుల కోసం ఉచితంగా వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ శిబిరం ఏప్రిల్ 25 నుండి మే 2వ తేదీ వరకు ఆర్మూర్ రోడ్డులోని R.B.V.R.R స్కూల్ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.ఈ శిబిరంలో 9వ, 10వ తరగతులు మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే అర్హత ఉంది. శిబిరంలో పాల్గొనేవారికి ఉచిత బ్రేక్ ఫాస్ట్ ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగా ఆత్మసంరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్), ప్రేరణాత్మక కార్యక్రమాలు (మోటివేషన్), అలాగే మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించే పోలీస్ తరగతులు నిర్వహించనున్నారు.ఆసక్తి గల విద్యార్థినులు ఏప్రిల్ 13 నుండి 24వ తేదీ మధ్య ఫోన్ నెంబర్ 90009 94312 ద్వారా లేదా ఇక్కడి గూగుల్ ఫారంతో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








