May 2, 2026 5:45 pm

V1News Telangana

గోదావరిఖనిలో సిరి కేక్స్‌పై జరిమానా అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవు అదనపు కలెక్టర్ అరుణ శ్రీ వెల్లడి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

గోదావరిఖనిలో సిరి కేక్స్‌పై జరిమాన

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఏప్రిల్ 09:హ

గోదావరిఖని లక్ష్మీ నగర్‌లోని సిరి కేక్స్ అండ్ మోర్ దుకాణంలో గడువు ముగిసిన ముడిపదార్థాలతో కేకులు, స్వీట్లు తయారు చేసి, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులలో విక్రయిస్తున్నట్లు గుర్తించిన రామగుండం నగర పాలక సంస్థ, దుకాణ నిర్వాహకుడికి రూ.20,000 జరిమానా విధించింది. అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఆదేశాలతో బుధవారం ప్రజారోగ్య విభాగం హెల్త్ అసిస్టెంట్ కిరణ్ నేతృత్వంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. కాలం చెల్లిన రసాయనాల వాడకం గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Comment

Read more
Read more