June 17, 2026 1:22 am

V1News Telangana

బోధన్ ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, ఎమ్మార్వో, ఎసిపి ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భం బోధన్ పట్టణంలో సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్‌లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్న ఇఫ్తార్ విందు
. బోధన్ పట్టణంలో ముస్లింలతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

సౌహార్ద వాతావరణంలో ఇఫ్తార్ విందు – బోధన్‌లో ప్రత్యేక కార్యక్రమం
. బోధన్ ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, ఎమ్మార్వో, ఎసిపి ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భం
బోధన్ పట్టణంలో సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు

బోధన్ పట్టణంలో రంజాన్ పవిత్ర నెల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఎమ్మార్వో విట్టల్, ఎసిపి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలసి సౌహార్ద వాతావరణంలో ఇఫ్తార్ చేస్తూ, వారితో మమేకమయ్యారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, సామాజిక సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై రంజాన్ పవిత్రతను స్మరించుకున్నారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించుకోవడం అత్యంత అవసరం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని, అన్ని వర్గాల ప్రజలతో కలిసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

సబ్ కలెక్టర్ వికాస్ మహతో మాట్లాడుతూ, ప్రజలంతా మత సామరస్యంతో కలిసి మెలిసి సభ్యసమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఈ ఇఫ్తార్ విందుతో బోధన్ పట్టణంలో మత సామరస్యానికి మరో మజిలీ కుదిరిందని హాజరైనవారు అభిప్రాయపడ్డారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more