May 2, 2026 11:47 pm

V1News Telangana

PDS బియ్యం గోదాంలపై టాస్క్ ఫోర్స్ దాడులు – 8 టన్నుల రైస్ స్వాధీనం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్‌లో అక్రమంగా నిల్వ చేసిన PDS రైస్ పట్టివేత…
నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఘాటైన దాడులు – ముగ్గురు నిర్వాహకులు అరెస్టు…
అక్రమ రైస్ నిల్వలపై పోలీసుల కఠిన చర్య – రూ.2.8 లక్షల విలువైన PDS బియ్యం స్వాధీనం..
. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ముమ్మర దాడులు…

 

PDS బియ్యం గోదాంలపై టాస్క్ ఫోర్స్ దాడులు – 8 టన్నుల రైస్ స్వాధీనం

నిజామాబాద్, మార్చి 15: ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద పేదలకు సరఫరా చేయాల్సిన PDS బియ్యాన్ని అక్రమంగా నిల్వచేస్తున్న గోదాంలపై పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి గారి నేతృత్వంలో బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు గోదాంలపై శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 టన్నుల PDS బియ్యం స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ రూ.2.8 లక్షలు ఉంటుందని అంచనా.

దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. అదనంగా, ముగ్గురు గోదాం నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం బోధన్ టౌన్ SHOకి అప్పగించారు.

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారు మాట్లాడుతూ, “ప్రభుత్వ పథకాల్ని దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు అక్రమ రైస్ నిల్వల గురించి సమాచారం అందిస్తే, తక్షణమే చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

ప్రజలకు రేషన్ బియ్యం క్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more