May 2, 2026 5:44 pm

V1News Telangana

ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు మహిళల పట్ల మర్యాదగా ఉండాలి సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి

సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా

 

 

 

 

 

 

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మార్చ్ 13:-

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోలీ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండ , మహిళల పట్ల మర్యాదగా ఉంటూ సంప్రదాయ పద్ధతుల్లో హోలి జరుపుకుందామని రామగుండము పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిశోరే ఝా ప్రజలకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ హోలీ పండుగను ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హోలీ అనంతరం యువత స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని, ప్రధానముగా బహిరంగ ప్రదేశాలపై, అనుమతి లేకుండా వ్యక్తులపై, మహిళలు, యువతులు, వాహనాలపై రంగులు చల్లడం బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని. హోలీ పండుగను సజావుగా జరుపుకొనేందుకు రామగుండము పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించబడుతుందని, ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Comment

Read more
Read more