కామ్రేడ్ బొజ్జ భూమా గౌడ్ వర్ధంతి సభ ఘనంగా నిర్వహణ – ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్థాయిగా నిలుస్తుంది..
కోటగిరి మండల కేంద్రంలో కామ్రేడ్ బొజ్జ భూమా గౌడ్ నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై. ఓమయ్య, మండల కార్యదర్శి ఈ. విట్టల్ గౌడ్, సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
సభలో భూమా గౌడ్ గారి సేవలను కొనియాడుతూ నాయకులు ఆయన నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం, రైతాంగం, వ్యవసాయ కూలీలు, కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడిగా ప్రశంసించారు. వర్ని మండలంలో భూ పోరాటాలను నిర్వహించి పేదలకు పట్టాలు ఇప్పించిన ఘనత ఆయనకే చెందుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర గీత పనివారి సంఘం జిల్లా అధ్యక్షుడిగా భూమా గౌడ్ బాధ్యతలు నిర్వహించేటప్పుడు సహకార సంఘాలు, టీఎఫ్టీ కార్మికుల లైసెన్స్‌ల కోసం నిరంతరం పోరాటం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్లగంగాధర్, వీరేశం, శంకర్, భీమయ్య, గీతా పనివారి సంఘం మండల సహాయ కార్యదర్శి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొని, భూమా గౌడ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
భూమా గౌడ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నిరంతరం కృషి చేస్తుందని సిపిఐ నేతలు స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








