May 2, 2026 7:20 pm

V1News Telangana

పలు డివిజన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ టి యు ఎఫ్ ఐ డి సి నిధులు 29.5 కోట్లతో లక్ష్మీ నగర్ అభివృద్ధి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పలు డివిజన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

టి యు ఎఫ్ ఐ డి సి నిధులు 29.5 కోట్లతో లక్ష్మీ నగర్ అభివృద్ధి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మార్చ్ 04:-

మేదర్ బస్తి , ఉల్లిగడ్డ బజార్, అబ్దుల్ కలాం స్టాచ్యూ, కళ్యాణ్ నగర్, లక్ష్మీ నగర్, వెంకటేశ్వర సైకిల్ టెక్స, లో టి యు ఎఫ్ ఐ డి సి నిధుల నుండి 29.5 కోట్లతో యు జి డి, సెంట్రల్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనే, మరియు రోడ్స్, పనులను పరిశీలించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా లక్ష్మీ నగర్ వ్యాపారస్తుల సహకారంతో అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నాం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తెలిపారు.లక్ష్మీ నగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, వాటర్ లైన్, జరుగుతున్న పనుల వల్ల కొంత ఇబ్బంది పడ్డ పూర్తిస్థాయిలో రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆలోచించి 30 నుండి 40 సంవత్సరాల వరకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు నడవడం జరుగుతుందన్నారు.

రామగుండం నియోజకవర్గం ప్రజలు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా జరిగే అభివృద్ధి కార్యక్రమాలను సహకరించి ఈ రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంనికి ముందు భాగంలో ఉండే విధంగా చేసుకొని బాధ్యత మన అందరి పైన ఉందని తెలియజేశారు.

రోడ్లను లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా కానీ ఇతర పనుల కోసం రోడ్లను పగలగొట్టే ప్రయత్నం చేస్తే మున్సిపల్ అధికారులు ఐదు లక్షల రూపాయలు జరిమానా వేస్తారు ఈ రోడ్లను కాపాడుకునే బాధ్యత మీ అందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Comment

Read more
Read more