May 2, 2026 7:21 pm

V1News Telangana

మార్చి 20 లోపు రోడ్లు , డ్రైన్ పనులు పూర్తి చేయాలి …..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష టీబీ అనుమానితులలో ప్రతి ఒక్కరికి పకడ్బందీగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మార్చి 20 లోపు రోడ్లు , డ్రైన్ పనులు పూర్తి చేయాలి …..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

టీబీ అనుమానితులలో ప్రతి ఒక్కరికి పకడ్బందీగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం, ఫిబ్రవరి-25:-

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన రోడ్డు, డ్రైయిన్ అభివృద్ధి పనులు మార్చి 20 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం నగరంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి విస్తృతంగా పర్యటించారు. టి.యూ.ఎఫ్.ఐ.డి.సి క్రింద రామగుండం నగరంలోని లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్ ప్రాంతాల్లో 29 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను, 5 కోట్లతో సింగరేణి ఆఫీస్ నుంచి బస్ డిపో వరకు జరుగుతున్న డ్రైయిన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి, మార్చి 20 లోపు ఈ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అడ్డగుంటపల్లె లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించారు. అర్బన్ ప్రైమరీ సెంటర్ పరిధిలోని గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేస్తూ వివరాలు నమోదు చేయాలని, ప్రసవానికి సమీపంలో గల గర్భిణీ స్త్రీలను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా ప్రతిష్ట కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో టిబి అనుమానితులందరికీ నిర్ధారణ పరీక్షలు జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఎన్.సి.డి సర్వే పూర్తి చేసి అభా కార్డులను జనరేట్ చేయాలని అన్నారు.అనంతరం రామగుండం నగర పురపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న టీబీ శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఒకేసారి జనం అధికంగా గుమి కూడకుండా, ప్రణాళిక బద్ధంగా అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ ఎస్ఈ శివానంద్, ఈఈ రామన్, ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Comment

Read more
Read more