May 2, 2026 7:22 pm

V1News Telangana

గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలకు మురికి నీళ్ళే గతా ? గోదావరి నది ఒడ్డున ఉన్న శివుని పట్టించుకునే నాధుడు కరువు 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలకు మురికి నీళ్ళే గతా ?

గోదావరి నది ఒడ్డున ఉన్న శివుని పట్టించుకునే నాధుడు కరువు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి 25:-

ఖాని శివారులో గోదావరిఖని చుట్టూ ఉండే ప్రజానీకం పుణ్య స్నానాల కోసం గోదావరి నది కి వస్తారు అయితే పుణ్యస్నాల కోసం వచ్చే భక్తులకు కనీస సౌకర్యలు చేయలేని స్థితిలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉండటం అమానుష సంఘటన అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ ఏడాది శివరాత్రి వేడుకలకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్య కరమైన విషయం అని ప్రజలు పాపోతున్నారు. కార్పొరేషన్ లో ఉన్న కనీసం సింగరేణి సంస్థతో పాటు ఇతర పరిశ్రమలు అయిన పట్టించుకోకపోవడం ప్రశ్నార్థకం ఈటు బల్దియా అటు సింగరేణి నడుమ ఉన్న కూడా ఎవరు అటు వైపు చూడటం లేదు అని ప్రజలు అసంతృప్తి వక్తం చేస్తున్నారు. కనీసం నది ఒడ్డున ఉన్న శివుని భారీ విగ్రహానికి రంగులు కూడా వేయలేని స్థితిలో కార్పొరేషన్ ఉండటం పై ఎన్నో ప్రశ్నలు వెలువడుతున్నాయి. గత ప్రభుత్వం లో ఉన్న నాయకులు ఏరియా హాస్పిటల్ పరిధిలో ఉన్న శివుని భారీ విగ్రహాన్ని గోదావరి నది ఒడ్డుకు చేర్చారు అయితే దాని పర్యవేక్షణ లోపంతో కేవలం విగ్రహం మాత్రమే మిగిలింది నిత్యం ప్రజలు గోదావరి నదికి పుణ్య స్నానాల కోసం తదితర కార్యక్రమాలకు తరచూ వస్తూనే ఉంటారు అయితే విగ్రహానికి కనీస రంగులు వేయకపోవడంపై ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు. దీని పై అధికారులు స్పందించి వెంటనే కనీస వసతులు మరియు విగ్రహానికి రంగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Comment

Read more
Read more