June 17, 2026 4:02 am

V1News Telangana

అందరి చూపు బాన్సువాడ వైపే….. – ఉత్కంఠ రేకెత్తిస్తున్న బాన్సువాడ రాజకీయాలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అందరి చూపు బాన్సువాడ వైపే…..
– ఉత్కంఠ రేకెత్తిస్తున్న బాన్సువాడ రాజకీయాలు

– కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు. – బిఆర్ఎస్ పార్టీలో నాయకత్వ లేమి .- శాసనసభ ఎన్నికలలో ప్రభావం చూపని బిజెపి అభ్యర్థి.
– అసంతృప్తితో పార్టీ శ్రేణులు.ప్రత్యామ్నాయలవైపు దృష్టి
– బిజెపి పార్టీ తరఫున NRI కోనేరు శశాంక్ ఎంట్రీ .- బిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ కవిత పాగా వేయాలని ప్రణాళికలు
– అధినాయకులకు తలనొప్పిగా మారిన బాన్సువాడ నియోజకవర్గం..

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరుతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని.. అందువల్ల పార్టీ శ్రేణులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే శాసనసభ ఎన్నికలలో నియోజకవర్గానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి షాయ శక్తుల ప్రయత్నించి తృటిలో ఓటమిపాలైనప్పటికీ .. తిరిగి అతి కొద్ది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలను ఏర్పాటు చేసి కంటిమీద కునుకు లేకుండా నాయకులు, కార్యకర్తలతో మమేకమై వారిని పరుగులు పెట్టించి పార్లమెంటు ఎన్నికలలో ఎంపీ అభ్యర్థికి నియోజకవర్గం నుండి మెజారిటీ అందించి తమ సత్తా చాటుకున్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిన తర్వాత నాయకత్వలేమితో నిరాశతో ఆ పార్టీ శ్రేణులు కూడా తటస్థంగా ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. బిజెపి పార్టీ విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసే సరైన నాయకత్వం లేదని..

శాసనసభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ప్రభావం చూపలేకపోయారని పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కనబడుతున్నట్లు ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బిజెపి పార్టీ తరపున (NRI) కోనేరు శశాంక్ ఎంట్రీ ఇవ్వడం బాన్సువాడ రాజకీయాలలో ఆసక్తిగా మారింది.బిజెపి శ్రేణులలో నూతన ఉత్తేజాన్ని నింపి పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసే దిశగా సేవా కార్యక్రమాలతో అడుగులు వేస్తూ కనబడుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన అసంతృప్తిగా ఉన్న నాయకులు, కార్యకర్తలు బిజెపి పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రజల నుండి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం హఠాత్తుగా కవితను రంగంలోకి దించడం మరింత ఉత్కంఠకు తెరలేపిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 47 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి,

నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన రాజకీయ దురంధరుడి తో పోటీపడడానికి అన్ని పార్టీల నాయకులు సన్నద్ధమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పార్టీ మారడం వల్ల ఆయన అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో కొంతమేర అసంతృప్తి నెలకొన్నప్పటికీ తిరిగి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారడంలో ఎటువంటి సందేహం లేదు. హేమహేమీలు సైతం ఆయన చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పొగడ్తలు గుప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి.భవిష్యత్తులో ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ఏ నాయకునికి వారు పట్టం కట్ట బోతున్నారో వేచి చూడాల్సిందే.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more