June 17, 2026 3:04 am

V1News Telangana

చిరు వ్యాపారస్తులకు ఆధారమెట్ల రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం /// ఎన్నికల అప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనట్టు ///  రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

చిరు వ్యాపారస్తులకు ఆధారమెట్ల రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఎన్నికల అప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనట్టు

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 11:-

అభివృద్ధి జపంతో కుల్చివేతల పర్వం సాగుతుందని, చిరు వ్యాపారుల ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా దుకాణ కూల్చివేతలు చేయడంతో వారి జీవితాలను రోడ్డున పడ్డాయాని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు శనివారం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి సుందరీకరణ పేరుతో ఎన్టీపీసీ గోదావరిఖని లో చిరు వ్యాపారుల దుకాణాలను కూల్ చేస్తూ వారి జీవితాలను రోడ్డుమీద తీసుకువచ్చరని వారు దినదిన గండంగా బతికే పరిస్థితి నేడు నెలకోందన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామిలను నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే దాట వేస్తున్నరని ప్రజల గొంతుకగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని స్దానిక ఎమ్మెల్యే ను ప్రశ్నిస్తున్నమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన మహాలక్ష్మి పథకం కింద మహిళలు నెలకు 2500 వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతులకు రైతు భరోసా కింద 15 వేల రూపాయల పెట్టుబడి సహాయంఇప్పటి వరకు అమలు కాలేదని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఏమైనావో స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజు ఠాగూర్ సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ మహిళలకు 2500 రూపాయలు వృద్ధులకు నాలుగు వేలు రైతు లకు 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు సంవత్సర కాలం గడుస్తున్న ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. గత వైభవాన్ని పూర్వ వైభవాన్ని తెస్తా అని స్దానిక ఎమ్మెల్యే మాట్లాడుతున్నడని గత వైభవం అంటే ఈ ప్రాంతం ఒక గ్రామపంచాయతి… ఒక నోట్ ఫైడ్ ఏరియా.. ఒక మున్సిపల్ ప్రాంతం అన్నారు. ఓసిపి 5 బాస్టింగ్ లతో పరిసర ప్రాంతాల నివాసాలు పూర్తిగా దెబ్బతీంటున్నాయన్నాయని వాటిపై సింగరేణి యాజమాన్యంతో మాట్లాడాలన్నారు. సింగరేణి క్వాటర్స్ కు మౌళిక వసతుల కల్పించడం కోసం మాట్లాడాలన్నారు. దుకాణాలను కుల్చడం కాదని ఉన్న ఇళ్లను క్వాటర్లను కపాడాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామిలను నెరవెర్చాలని స్దానిక ఎమ్మెల్యే ను డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశం లో రామగుండం కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణ వేని నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు నారాయణదాసు మారుతి బోడ్డు రవీందర్ నూతి తిరుపతి సట్టు శ్రీనివాస్ జక్కుల తిరుపతి ఇరుగురాళ్ల శ్రావన్ శేషగిరి వెంకన్న ఆవునూరి వెంకటేష్ ముద్దసాని సంధ్యా రెడ్డి రాజేష్ ఆతరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Comment

Read more
Read more