June 17, 2026 5:06 am

V1News Telangana

*గొర్రెపాటి మాధవరావు గారి జీవితం పీడిత ప్రజలకు అంకితం*

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

*గొర్రెపాటి మాధవరావు గారి జీవితం పీడిత ప్రజలకు అంకితం*

*_విస్. కృష్ణ. తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక సమన్వయ కమిటీ సభ్యులు_*

గొర్రెపాటి మాధవరావు గారి జీవితం పిడిత ప్రజలకు అంకితమని తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక సమన్వయ కమిటీ సభ్యులు ఎస్. వి కృష్ణ అన్నారు.

గొర్రెపాటి మాధవరావు గారి సంస్మరణ సభ ను ఎల్లమ్మ గుట్టలోని మాధవరావు ఇంటి వద్ద *జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్* ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. జంపాల మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఆకుల పాపయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా వచ్చిన వి ఎస్ కృష్ణ గారు మాట్లాడుతూ మాధవరావు గారు తన జీవిత కాలం అంత పీడిత ప్రజల హక్కుల కోసం ఆలోచించేవాడని, ఎన్కౌంటర్ బాధితులకు కోర్టు ద్వారా నష్టపరిహారం ఇప్పించినటువంటి చరిత్ర గొర్రెపాటి మాధవరావు గారిది అన్నారు. తన తుది శ్వాస వరకు తన రచనాలతో ప్రజలను చైతన్యం చేసి ఉద్యమాల వైపు నడిపించారని గుర్తు చేశారు . రాజ్యం పట్ల, చట్టం పట్ల, సమాజ మార్పు పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి అన్నారు. నిరంతరం తన రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా ప్రజలను చైతన్య పరచాడని గుర్తు చేశారు. మానవ హక్కులకు రక్షణ కవచంగా నిలబడ్డారని అన్నారు. ప్రతి సమస్యను హక్కుల కోణంలో ఆలోచించేవాడని తెలిపారు. ప్రజాస్వామీకవాదుల పై రాజ్యం మోపిన అనేక తప్పుడు కేసులను న్యాయపోరాటం చేసి గెలిచి ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు….


మరో వక్త
సిపిఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య గారు మాట్లాడుతూ పెట్టుబడిదారి వర్గం, భూస్వామ్య వర్గ దోపిడీకి వ్యతిరేకంగా, అణిచివేత అసమానతలపై సామాజిక మార్పు కోసం నిరంతరం మాధవ రావు గారు కృషి చేశారని అన్నారు. ప్రతి మనిషికి హక్కులు ఉన్నాయని, ఆ హక్కుల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ హక్కుల నాయకుడిగా అందరికీ సుపరిచితంగా ఉన్నాడని తెలిపారు. వామపక్ష పార్టీలలో అవినీతిని ఎత్తి చూపారు. ప్రజలకు వామపక్షాల పార్టీలు జవాబు దారిగా ఉండాలనే వారని అన్నారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యహింస పై తనదైన ప్రత్యేకమైన శైలి లో చట్టం ద్వారా ఉద్యమించాలన్నారు. CAA, NRC , కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతాంగ వ్యతిరేక చట్టాలపై మంచి అవగాహన కలిగించిన వ్యక్తి అన్నారు. భారత రాజ్యాంగం ను పూర్తిగా అవసోపాన పట్టిన గొప్ప మేథావి గొర్రెపాటి మాధవరావు గారు అని కొనియాడారు.
*అనంతరం మన హక్కుల వేదిక ఉమ్మడి పూర్వ మాజీ రాష్ట్ర అధ్యక్షులు జీవన్ కుమార్ గారు* మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రగతిశీల ఆలోచనలు కలిగి వ్యక్తి మాధవ రావు గారిది అన్నారు.
తను తుది శ్వాస వదిలే వరకు అనేక పుస్తకాలను అవసోపణ పట్టిన వ్యక్తి అని, ప్రతి విషయాన్ని తనదైన శైలి లో తన రచనల ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చేవాడని *నిరంతర జ్ఞాన అన్వేషియని* ,ఆయన ఇల్లే *ఒక గ్రంథాలయమని* అన్నారు. రాష్ట్ర హక్కుల ఉద్యమంలో మాధవ రావు కీలక పాత్ర పోషించాడని, హక్కుల సంస్థకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. రానున్న రోజుల్లో ఆయన రచనలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో.

జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ట్రస్ట్ సభ్యులు, మానవ హక్కుల వేదిక నాయకులు, కుటుంబ సభ్యులు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు మరియు వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more