-- --

శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

52 జంటలతో భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ…

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 52 మంది దంపతులు పాల్గొని సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు.

కార్తీకమాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ఈ సామూహిక వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దంపతులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

వ్రతాలు నిర్వహించిన దంపతులకు సంజీవరెడ్డి–నాగరాణి దంపతులు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, చైర్మన్ లక్ష్మణరావు పటేల్, మౌనిక పోశెట్టి, వీరప్ప ఆర్గుండా, శంకర్ సున్నం, గంగాధర్ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి రాములు, ఆలయ అర్చకులు మహేష్, శివకుమార్, సిబ్బంది సుధాకర్, చంద్రకళ, పుష్పతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

కార్తీకమాసంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more