-- --

విద్యార్థుల బస్సు సౌకర్యం కోసం బీజేపీ నాయకుల వినతి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రాంపూర్, సుద్దులం తండా గ్రామాలకు బస్సులు నడపాలని డిపో మేనేజర్‌కు విజ్ఞప్తి

బోధన్: కోటగిరి మండలంలోని రాంపూర్, సుద్దులం తండా గ్రామాలకు విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక బీజేపీ నాయకులు బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు రాకపోకల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా గ్రామాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరారు.

దీనిపై డిపో మేనేజర్ స్పందిస్తూ, ఈ సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి ఆయా గ్రామాలకు బస్సులు నడిచేలా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మార్కెలి ప్రకాష్ పటేల్, బోధన్ 33వ వార్డు బీజేపీ కౌన్సిలర్ గుంత గంగాధర్, ఎస్టీ మోర్చా జిల్లా కార్యదర్శి కే. దుర్గా ప్రసాద్, బోధన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ కొలిపాక బాలరాజు, కోటగిరి మండల బీజేపీ అధ్యక్షులు ఏముల నవీన్, ప్రధాన కార్యదర్శి వడ్ల శ్యామ్, రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నాయకులు పత్తి సతీష్, రోషన్ లాల్ జట్, ఎడ్డేడి చిన్న హనుమండ్లు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more