-- --

ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిల భారం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

ఐదు ప్రధాన ఆస్పత్రులకు రూ.292.80 కోట్లకు పైగా పెండింగ్‌!

హైదరాబాద్‌, నవంబర్ 18( v1news): –రాష్ట్ర రాజధాని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులకు కోట్లాది రూపాయల నిధులు విడుదల కాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ పై ప్రభావం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

వివరాల ప్రకారం.. ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి అత్యధికంగా రూ.173.80 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గాంధీ ఆస్పత్రికి రూ.54 కోట్లు, నిలోఫర్ ఆస్పత్రికి రూ.40 కోట్లు, సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి రూ.14 కోట్లు, ఈఎన్‌టీ ఆస్పత్రికి రూ.11 కోట్ల చొప్పున బకాయిలు పేరుకుపోయాయి.

ఈ ఐదు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు కలిపి మొత్తం రూ.292.80 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆరోగ్య శ్రీ బకాయిలతో పాటు ఆస్పత్రుల సాధారణ నిర్వహణకు అవసరమైన రెగ్యులర్ నిధులను కూడా తక్షణమే విడుదల చేయాలని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు నిధుల కొరత లేకుండా చూడాలని, పెండింగ్ బిల్లులను త్వరితగతిన క్లియర్ చేసి వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more