-- --

పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య….

నిజామాబాద్, నవంబర్ 18 (వి1 న్యూస్): నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్, క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా జానకంపేటలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్, ముగింపు వేడుకల కోసం సిద్ధం చేస్తున్న పరేడ్ గ్రౌండ్, ప్రధాన వేదిక, అతిథుల గ్యాలరీతో పాటు క్రీడాకారులు, పోలీస్ సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు, పోలీస్ అధికారులు, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపడుతున్న ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.

ముగింపు వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తూ, కార్యక్రమ నిర్వహణలో సమన్వయం, క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేడుకలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఐటీ సెల్ ఏసీపీ నరేందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ధరణి, ఎం.టి.ఓ. శేఖర్ బాబు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వినోద్, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more