అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: అల్లె రమేష్…

సాలూర, నవంబర్ 18 (వి1 న్యూస్): సాలూర మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ పత్రాలను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి, సొసైటీ చైర్పర్సన్ అల్లె రమేష్ చేతుల మీదుగా ఈ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా అల్లె రమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు కలిపి మొత్తం 96 చేయూత పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించి, సామాజిక భద్రత అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా ఆర్థిక చేయూత అందడంతో వారి జీవనానికి కొంతమేర భరోసా లభిస్తుందని అన్నారు.
అర్హులైన పేదలకు పింఛన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా వార్డు సభ్యులు, ఇల్తేపు శంకర్ సార్. అల్లె జనార్దన్, రాజ్ పటేల్, శివకాంత్ పటేల్, గ్రామ కార్యదర్శి ప్రవీణ్, పింఛన్ లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు….
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







