-- --

స్వీట్లపై వెండి పూత ముసుగులో అల్యూమినియం కోటింగ్!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

స్వీట్లపై వెండి పూత ముసుగులో అల్యూమినియం కోటింగ్!

చార్మినార్ కేంద్రంగా నకిలీ వెండి వర్క్ తయారీ..

ప్రముఖ స్వీట్ షాపులకు సరఫరా

హైదరాబాద్, నవంబర్ 18(వి వన్):- నగరంలో స్వీట్ల ప్రియులకు ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. స్వీట్లపై వెండి పూత పేరుతో అల్యూమినియం కోటింగ్‌ను వినియోగిస్తున్న ముఠాలపై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. చార్మినార్ కేంద్రంగా నకిలీ వెండి వర్క్ తయారు చేసి నగరంలోని ప్రముఖ స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ అక్రమ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నకిలీ వెండి వర్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 49 బండిళ్ల నకిలీ వెండి వర్క్‌తో పాటు సుమారు 10 కిలోల అల్యూమినియం రేకులు, ఇతర ముడిసరుకు, తయారీకి ఉపయోగించే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంపై సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ప్రజలు వెండి పూతతో ఆకర్షణీయంగా కనిపించే స్వీట్లు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి అక్రమ వ్యాపారాలపై నిఘా కొనసాగుతోంది.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more