-- --

సేవాభావానికి ఘన వీడ్కోలు.. ఎస్సై వంగాల కృష్ణారెడ్డి పదవీ విరమణ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ రీజినల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఘనంగా రిటైర్మెంట్ వేడుకలు..

నిజామాబాద్, నవంబర్ 2: నిజామాబాద్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీ వంగాల కృష్ణారెడ్డి పదవీ విరమణ సందర్భంగా సోమవారం నిజామాబాద్ రీజినల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

నిజామాబాద్ రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శ్రీ డి. రఘు చందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి జోన్లకు చెందిన ఇంటెలిజెన్స్ సిబ్బంది పాల్గొని కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన పోలీస్ శాఖలో అందించిన సేవలను సిబ్బంది గుర్తుచేసుకున్నారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన సేవలు అందించడం ద్వారా ఆయన సహచరుల మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు.

సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న కృష్ణారెడ్డికి సిబ్బంది ఘనంగా సన్మానం చేసి, జ్ఞాపికలు అందజేశారు. ఆయన భవిష్యత్తు జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. విధి నిర్వహణలో సహచరుడిగా అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more