#బోధన్‌లో మున్సిపల్ కార్మికుల ధర్నా
పెండింగ్ వేతనాలు చెల్లించాలి.. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..
బోధన్, నవంబర్ 2 (V1 న్యూస్): మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో సోమవారం బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.

మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ వేతన బకాయిలతో పాటు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు అవసరమైన పనిముట్లు అందించాలని, వేతనాల నుంచి మినహాయిస్తున్న పీఎఫ్, ఈఎస్ఐ సొమ్మును సంబంధిత కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
అలాగే బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆసుపత్రి సమీపంలోని జనరల్ ఆసుపత్రికి ఈఎస్ఐ ఆసుపత్రిని మార్చి, స్థానికంగానే కార్మికులకు వైద్య సేవలు అందించాలని, అర్హులైన కార్మికులందరికీ ఈఎస్ఐ కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని కోరారు.
కార్మికుల సమస్యలపై స్పందించిన ఆర్డీవో మున్సిపల్ చైర్మన్‌తో ఫోన్లో మాట్లాడారు. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికులకు పనిముట్లు అందించడంతో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని సూచించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు బి. మల్లేష్, యూనియన్ నాయకులు బి. పర్వయ్య, కె. గంగామణి, మరు భాయి, లావణ్య, జి. రాజు, భూమయ్య, పార్వతి, కృష్ణ, మాధవి, సాయిలు, తుకాబాయి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. నాలుగు నెలల వేతన బకాయిలు చెల్లించాలి.. బోధన్‌లో మున్సిపల్ కార్మికుల ఆందోళన
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







