రైతుల సంక్షేమానికి కృషి చేయాలి: మందర్న రవి
బోధన్, అక్టోబర్ 8:
బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్గా నాగేశ్వరరావు నియమితులైన సందర్భంగా హున్సా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సాలూర మండల అధ్యక్షుడు మందర్న రవి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావును శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మందర్న రవి మాట్లాడుతూ.. సాలూర మండల రైతులు, ప్రజల తరఫున నూతన ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, రైతులు తమ పంటలను దళారుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధరలకు విక్రయించుకునేలా అవసరమైన సహకారం అందించాలని ఆకాంక్షించారు.
రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన మౌలిక వసతులు, పంటల కొనుగోళ్లలో పారదర్శకత, రైతులకు సకాలంలో చెల్లింపులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా చర్చించుకున్నట్లు మందర్న రవి తెలిపారు. రైతుల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగేందుకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తగ్గెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరావు, అమ్ముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







