-- --

సాలంపాడ్‌లో ఉచిత కంటి, షుగర్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

సాలంపాడ్, అక్టోబర్ 5: లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో సోమవారం సాలంపాడ్ గ్రామంలో ఉచిత కంటి మరియు షుగర్ పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.

ఈ శిబిరంలో డాక్టర్ అజయ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు, షుగర్ పరీక్షలు నిర్వహించి, ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సూచనలు అందించారు. గ్రామంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ అధ్యక్షులు లయన్ కుమ్మరి పోశెట్టి, క్యాంపు ఇన్‌చార్జి లయన్ హనుమంత్ రావు, సర్పంచ్ శీలం నర్మదా సంతోష్ రెడ్డి, ఉపసర్పంచ్ సత్తర్, మాజీ ఎంపీపీ గైని పెద్ద గంగారాం, గ్రామపంచాయతీ కార్యదర్శి రఘుపతి రెడ్డి, గ్రామ పెద్ద శీలం సంతోష్ రెడ్డి, ఎఫ్‌ఏ షాదుల్ల తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ప్రోగ్రాం చైర్మన్: లయన్ కుమ్మరి పోశెట్టి
ఇట్లు: గుడిపల్లి గంగారెడ్డి, సెక్రెటరీ, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more