ముషీర్‌నగర్, సెప్టెంబర్ 17 (V1 న్యూస్): ముషీర్‌నగర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు, తండాల అభివృద్ధి కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను వారు గుర్తుచేసుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3,146 గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయని నాయకులు తెలిపారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో స్థానిక పాలనకు మరింత ప్రాధాన్యం లభించిందని పేర్కొన్నారు. అలాగే ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు పెరిగాయని వారు అన్నారు.
తండాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించడం వల్ల గిరిజన ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేసే అవకాశం పలువురికి లభించిందని నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ దుంపల శుభాష్, పీపావత్ రాజు నాయక్, దుంపల సాయిలు, నాయకపోడ్ నిత్యానందు, బట్టు పాపాసింగ్, బట్టు లక్ష్మణ్, బట్టు బలిరామ్, బట్టు కైలాష్, దేవుడు, సుధీర్ తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







