“ప్రతి నిరుపేద విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి”..
ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కాకూడదు: అల్లే రమేష్…
సాలూర, సెప్టెంబర్ 15: ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచేందుకు రోటరీ క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బోధన్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 55 మంది నిరుపేద విద్యార్థులను ఎంపిక చేశారు.
ఎంపికైన వారిలో సాలూర మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలు గతంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో రోటరీ క్లబ్ సెక్రటరీ అల్లే రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను కలుసుకుని సహాయాన్ని అందించారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, చెక్కులను అందజేశారు.

అదేవిధంగా ఎంపికైన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,500 విలువైన నిత్యావసర సరుకులను అందించనున్నట్లు రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కుటుంబ పరిస్థితులు చదువుకు ఆటంకంగా మారకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అల్లే రమేష్ మాట్లాడుతూ, “ప్రతి నిరుపేద విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే మా లక్ష్యం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదు. నిరుపేద విద్యార్థులకు రోటరీ క్లబ్ తరఫున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాం” అని తెలిపారు.
విద్యార్థులకు అవసరమైన వస్తువులు, నిత్యావసర సరుకులు అందించడం ద్వారా వారి చదువుకు తోడ్పాటునందించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలను స్థానికులు అభినందించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









