-- --

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమం 5 వేల మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్ వినూత్న సేవ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

5 వేల మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల వినియోగం అవసరం: ఆర్డీఓ విజయకుమారి

బోధన్, సెప్టెంబర్ 13 (వి.1 న్యూస్):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్‌పల్లి సంయుక్త ఆధ్వర్యంలో 5 వేల మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.

బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ విజయకుమారి హాజరై భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని సూచించారు.

రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. మట్టి వినాయకుల వినియోగంతో పర్యావరణానికి హాని తగ్గుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని 5 వేల మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.

కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్, ఏసీపీ శ్రీనివాస్, లయన్స్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు బసవేశ్వర్ రావు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి. లక్ష్మి, నాగేశ్వర్ రావు, శ్రీనివాస్ రావు, గాంధీ, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more