523 బస్తాలతో లారీ సీజ్.. మేడ్చల్ నుంచి బోధన్‌కు అక్రమ రవాణా?
బోధన్, సెప్టెంబర్ 11 (వి.1 న్యూస్): బోధన్ టౌన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానించిన భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు బియ్యం లోడ్‌తో వెళ్తున్న TS16UB3690 నంబర్ లారీని అనుమానంతో ఆపి తనిఖీ చేశారు.
లారీలో 523 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వాటికి సంబంధించి డ్రైవర్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు లేకపోవడంతో లారీని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం లారీని సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించగా, అధికారులు బియ్యాన్ని పరిశీలించి అవి పీడీఎస్ బియ్యంగా నిర్ధారించినట్లు తెలిపారు. మొత్తం బియ్యం సుమారు 250 క్వింటాళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రాథమిక విచారణలో మేడ్చల్ నుంచి బోధన్‌కు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌తో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
⚠️ అక్రమ రవాణాపై పోలీసుల హెచ్చరిక
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ వ్యవహారంలో బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ఆధ్వర్యంలో తరలిస్తున్నారు? బోధన్‌లో ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








