సాలూర–బోధన్ రహదారిపై ప్రమాదం.. కూలీ కార్మికుడు మృతి
రోడ్డుపై బంధువుల రాస్తారోకో.. ఇసుక కుప్పల వల్లే ప్రమాదమని ఆరోపణలు
సాలూరా, సెప్టెంబర్ 9 (వి.1 న్యూస్): సాలూరా మండల కేంద్రంలోని సాలూరా–సాలంపాడు మార్గంలో సబ్‌స్టేషన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాలంపాడు గ్రామానికి చెందిన గంగారం అనే వ్యక్తి మృతి చెందాడు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న గంగారం మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రమాద విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. అనంతరం సాలూరా–బోధన్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు…
ఇసుక కుప్పలే కారణమా?
సాలూరా–బోధన్ రహదారిపై ఇసుక కుప్పలు వేయడంతో వాహనదారులకు రాకపోకల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపించారు. రహదారిపై ఇసుకను నిల్వ చేయడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు.
ఎస్సై హామీతో ఆందోళన విరమణ…
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజశేఖర్ హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రాస్తారోకోను విరమించారు.
ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. రహదారిపై ఇసుక కుప్పల ఏర్పాటు, రహదారి భద్రతపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







