పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీటెక్ విద్యార్థి మృతి
ఎడపల్లి, సెప్టెంబర్ 9 (వి.1 న్యూస్): ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీటెక్ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో చోటుచేసుకుంది.
అంబం గ్రామానికి చెందిన కుర్రె సదానంద్ హైదరాబాద్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్యోగం లభించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన బుధవారం కుటుంబ సభ్యులకు సందేశం పంపినట్లు సమాచారం. అనంతరం ఆలీసాగర్ అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సదానంద్ మృతితో అంబం గ్రామంలో, ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







