-- --

పేదలు కబ్జా చేస్తే ప్రశ్నిస్తారు.. ప్రభుత్వ భూములపై ఆరోపణలు వస్తే ఎందుకు మౌనం?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అప్పుడు కబ్జాలపై గళమెత్తిన వారు ఇప్పుడు ఎందుకు మౌనం?

పేదలపై మాత్రం ప్రశ్నించే కార్యకర్తలు.. ప్రభుత్వ భూముల విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు?

సాలూరా, సెప్టెంబర్ 9 (వి.1 న్యూస్):
సాలూరా మండల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అనుమానాలు, ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో గతంలో భూ కబ్జాలపై గళమెత్తిన కొందరు కార్యకర్తలు, గ్రామ నాయకుల ప్రస్తుత మౌనంపై స్థానికంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గతంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయంటూ అధికారులను నిలదీసిన వారు.. కబ్జాలను బయటకు తీస్తామని ప్రకటించిన వారు.. ఇప్పుడు అదే ప్రభుత్వ భూముల విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది.

అప్పుడు ప్రశ్నించిన వారు.. ఇప్పుడు ఎందుకు మౌనం?

గతంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ ఆరోపణలు చేసిన గ్రామ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అప్పుడు కబ్జాలపై పోరాటం.. ఇప్పుడు మౌనం ఎందుకు?
అప్పుడు అధికారులను నిలదీత.. ఇప్పుడు నిశ్శబ్దం ఎందుకు?
ప్రభుత్వ భూమి విషయంలో అందరికీ ఒకే న్యాయం ఉండకూడదా?

అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పేదలు చేస్తేనే ప్రశ్నిస్తారా?

ఒక పేద కుటుంబం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిందనే ఆరోపణ వస్తే వెంటనే అధికారులను ఆశ్రయించి ప్రశ్నించే వారు.. అదే ప్రభుత్వ భూమిపై పెద్ద స్థాయిలో ఆక్రమణల ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

పేదలపై ఒక న్యాయం.. పలుకుబడి ఉన్నవారిపై మరో న్యాయమా?
ప్రభుత్వ భూమి విషయంలో వ్యక్తిని బట్టి వైఖరి మారుతుందా?

అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

బడాబాబుల’ ఒత్తిడా? లేక ఆధారాలు లేవా?

ప్రభుత్వ భూములపై ఆక్రమణల ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ కొందరు ప్రముఖులు, కార్యకర్తలు, గ్రామ నాయకులు ఎందుకు స్పందించడం లేదన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

వారి మౌనం వెనుక ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? ఎవరి ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయమా? లేక ఆరోపణలకు ఆధారాలు లేవా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

అయితే, ఎవరిపైనైనా ఆరోపణలు నిజమని నిర్ధారించాలంటే అధికారిక రికార్డులు, భూ సర్వే, క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి.

సర్వేతో నిజానిజాలు తేల్చాలి

సాలూరా మండల పరిధిలో ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి సర్వే నంబర్లు, మొత్తం విస్తీర్ణం, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి, భౌతిక హద్దులు, ఆక్రమణలు ఉన్నాయా లేదా అన్న విషయాలను అధికారులు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రత్యేకంగా సాలూరా చెక్‌పోస్ట్‌కు కేటాయించిన ప్రభుత్వ భూమిపై కూడా సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి అయితే దాని పరిరక్షణ బాధ్యత అందరిదీ కాదా? గతంలో కబ్జాలపై గళమెత్తిన వారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? పేదలు ఆక్రమిస్తేనే ప్రశ్నిస్తారా? పెద్దలపై ఆరోపణలు వస్తే ఎందుకు వెనుకడుగు? అధికారుల మౌనం వెనుక కారణమేంటి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు అధికారిక సర్వే, రెవెన్యూ రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణతోనే వెలుగులోకి రావాల్సి ఉంది.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more