-- --

విద్యార్థుల ప్రాణాలతో ఆర్టీసీ చెలగాటమా..?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఫుట్‌బోర్డుపై నిల్చుని విద్యార్థుల ప్రయాణం.. అధికారుల కంటికి కనిపించడంలేదా..?

ప్రైవేట్ వాహనాలపై చలాన్లు, జరిమానాలు.. ఆర్టీసీ బస్సుల్లో భద్రతపై చర్యలు ఎప్పుడు..?

సాలూర, సెప్టెంబర్ 9:
నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న హున్స, ఖాజాపూర్, తగెల్లి, సాలూర మీదుగా బోధన్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పాఠశాలలు, కళాశాలల సమయాల్లో బస్సుల్లో రద్దీ అధికంగా ఉండటంతో సీట్లు, నిలబడే స్థలం కూడా సరిపోని పరిస్థితి నెలకొంటోందని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.

దీంతో కొంతమంది విద్యార్థులు బస్సుల ఫుట్‌బోర్డుపై నిల్చుని ప్రయాణించాల్సి వస్తోందని, ఇది ఎప్పుడైనా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థుల ప్రమాదకర ప్రయాణ దృశ్యాలు అధికారుల కంటికి కనిపించడంలేదా..? ప్రమాదం జరిగిన తర్వాతే స్పందించాలా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రైవేట్ వాహనాలపై చర్యలు.. మరి ఆర్టీసీ బస్సుల సంగతేంటి..?

నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ వాహనాలపై చలాన్లు, జరిమానాలు విధించే అధికారులు.. విద్యార్థుల భద్రత విషయంలోనూ అదే స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ వాహనాలపై చర్యలు తీసుకుంటున్నప్పుడు.. మరోవైపు విద్యార్థులు ఫుట్‌బోర్డుపై నిల్చుని ప్రయాణించే పరిస్థితి ఎందుకు కొనసాగుతోంది..? ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయమా..? ఇదేనా అధికారుల బాధ్యత..? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

విద్యార్థుల భద్రతకు ప్రమాదం ఏర్పడే వరకు వేచి చూడకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. రద్దీ సమయాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన రూట్లలో సర్వీసుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది..? ఫుట్‌బోర్డుపై విద్యార్థులు ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది..?

ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది..?

విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగే పరిస్థితి ఏర్పడినప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు..? ఆర్టీసీ అధికారులా..? రవాణా శాఖ అధికారులా..? పర్యవేక్షణ లోపమా..?

ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొనడం మేలుకాదా..?

విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సాలూర–బోధన్ మార్గంలో రద్దీ సమయాల్లో అదనపు బస్సులు ఏర్పాటు చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇకనైనా అధికారులు స్పందిస్తారా..? లేక మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా..?

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more