ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని బీజేపీ నాయకుల ఆకాంక్ష
బోధన్: భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డీ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మారుతి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చనలు నిర్వహించారు.
వడ్డీ మోహన్ రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగుతూ భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని బీజేపీ నాయకులు ఆకాంక్షించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోధన్ బీజేపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపీకిషన్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలీపాక బాలరాజు, సీనియర్ నాయకులు హనుమాన్లు చారి, పట్టణ కోశాధికారి పప్పుల వేణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్తో పాటు కిరణ్, పవన్ కళ్యాణ్, లోశ్రే అనిల్, ఫణి, రవికుమార్, హరి, నర్సింలు, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







