-- --

బిడ్డ చనిపోయిందని నమ్మించి.. ఆడ శిశువు విక్రయం?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

1098కు ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన.. విచారణ చేపట్టిన ఐసీడీఎస్ అధికారులు…

“నవీపేట్‌లో ఆడ శిశువు విక్రయం కలకలం.. 1098 ఫిర్యాదుతో కదిలిన అధికారులు”

నవీపేట్, సెప్టెంబర్ 9:
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఎంచా గ్రామంలో ఆడ శిశువు విక్రయానికి సంబంధించిన ఆరోపణలు స్థానికంగా కలకలం రేపాయి. శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులకు నమ్మించి, అనంతరం ఆడ శిశువును బంధువులకు విక్రయించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

స్థానికులు, పోలీసుల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎంచా గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబంలో ఇటీవల ఆడ శిశువు జన్మించింది. సదరు మహిళకు ఇది మూడో సంతానం కాగా, గతంలో ఇద్దరు మగ పిల్లలు ఉన్నట్లు సమాచారం.

ఆడ శిశువు పుట్టిన అనంతరం కుటుంబ సభ్యులు బైంసాకు చెందిన సమీప బంధువులకు రూ.1.20 లక్షలకు శిశువును విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తన కుమార్తెను తిరిగి ఇవ్వాలని మహిళ భర్తతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.

ఈ క్రమంలో విషయం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫిర్యాదు కావడంతో అధికారులు స్పందించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. శిశువు ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎవరి వద్దకు తీసుకెళ్లారు? డబ్బుల లావాదేవీ జరిగిందా? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

శిశువు విక్రయానికి సంబంధించి ఆరోపణలు నిజమని తేలితే, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే విచారణ పూర్తయ్యే వరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు నిర్ధారించాల్సి ఉంది.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more