బోధన్: పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు.
ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తుల శ్రేయస్సును కాంక్షిస్తూ శ్రీ లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మహా హారతి అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కొత్త రాజేశ్వర్ గుప్తా, పబ్బ మురళి, కంటాల రమేష్, వాసర గంగాధర్, సంతోష్, కిరణ్, నాగ దుర్గ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, స్థానిక భక్తులు హాజరై వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







