సాలూరలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
11 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం…
సాలూరా, సెప్టెంబర్ 7: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూరా మండలంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 11 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలిపారు. తమ సేవలకు లభించిన ఈ గుర్తింపు బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మంజూష మాట్లాడుతూ.. విద్యార్థులే సమాజానికి నిజమైన ఆస్తి అని, వారి సర్వతోముఖ అభివృద్ధే ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యమని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అభినందనలు తెలిపారు.
సన్మానం పొందిన ఉత్తమ ఉపాధ్యాయులు:

- జి. సైలూ – SA, ZPHS సాలూరా
- కె. విఠల్ – SA, ZPHS సాలూరా
- ఏ. రామ – SA, MPHS హున్సా
- పి. సబిత కుమారి – SGT, MPPS HW సాలూరా
- ఎం. అశోక్ కుమార్ – SA, MPUPS టాగెల్లి
- పి. గుణశ్యామ్ – SGT, MPHS హున్సా
- వై. జ్యోతి – SGT, MPUPS ఖాజాపూర్
- ఎం. అనురాధ – SGT, MPUPS మాండెర్నా
- జె. ఆశ – SGT, MPPS సాలూరా
- ఎస్. గంగాధర్ – SGT, MPPS కుమ్మన్‌పల్లి
- మెహర్ సుల్తానా – SGT, MPPS ఫతేపూర్
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








