జక్రాన్‌పల్లి, సెప్టెంబర్ 7: జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా ఉత్సవాల్లో మార్చ్‌ఫాస్ట్ విభాగంలో ఆదర్శ విద్యా నికేతన్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని షీల్డ్‌ను జక్రాన్‌పల్లి మండల ఎంఈఓ శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకున్నారు. విద్యార్థుల క్రమశిక్షణ, సమిష్టి ప్రదర్శనకు ఈ విజయం నిదర్శనమని పాఠశాల నిర్వాహకులు పేర్కొన్నారు.
విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







