పాఠకుల సౌకర్యాలు, పుస్తకాల లభ్యతపై పరిశీలన
బోధన్, సెప్టెంబర్ 8: బోధన్ శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ నిజామాబాద్ చైర్మన్, కార్యదర్శి శ్రీమతి శ్రీలత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయ నిర్వహణ, పుస్తకాల లభ్యత, పాఠకులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా తొలిసారిగా బోధన్ గ్రంథాలయాన్ని సందర్శించిన శ్రీలతను పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది ఆత్మీయంగా సత్కరించారు.

అనంతరం గ్రంథాలయ ప్రాంగణంలో దాత సత్తేందర్ గౌడ్ అందజేసిన వివిధ రకాల మొక్కలను చైర్మన్, కార్యదర్శి నాటారు. మొక్కల సంరక్షణ కోసం గ్రీన్‌నెట్, వాటర్ ట్యాంక్ సౌకర్యాలను కూడా కల్పించిన దాత సత్తేందర్ గౌడ్‌ను వారు అభినందించి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







