-- --

ఏకచక్రేశ్వరాలయంలో వైభవంగా శ్రావణ సోమవారం పూజలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

శివనామస్మరణతో మారుమోగిన బోధన్.. కన్నులపండువగా అన్నపూజ, పల్లకీ సేవ..

V1 న్యూస్, బోధన్, సెప్టెంబర్ 7: శ్రావణమాస ఆఖరి సోమవారం, ఏకాదశి పర్వదినం ఒకేరోజు రావడంతో బోధన్ పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ ఏకచక్రేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేదపండితులు గణేష్ శర్మ, అర్చకులు మహేష్ పాఠక్, శివకుమార్‌ల మంత్రోచ్ఛారణలు, వేదఘోషల నడుమ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు ‘హర హర మహాదేవ’ నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించారు.

శ్రావణ సోమవారం, ఏకాదశి పర్వదినం కలయికను పురస్కరించుకుని బోధన్ పరిసర మండలాల నుంచి పలువురు భక్తులు కాలినడకన పాదయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. మహిళలు కుటుంబ సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ, మహా మంగళహారతి నిర్వహించగా, రాత్రి జరిగిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈఓ ఎన్. రాములు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు లక్ష్మణ్ రావు పటేల్, ఆరుగొండ శంకర్, సున్నం గంగాధర్, జక్కం వీరప్ప, ఈరపురం మౌనిక పోశెట్టి, సిబ్బంది సుధాకర్, చంద్రకళ, పుష్ప తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more