-- --

రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి: నర్ర రామారావు

బోధన్, ఆగస్టు 22: మత, కుల, లింగ, ప్రాంతీయ భేదాలకు అతీతంగా దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు అన్నారు. విద్యార్థులు భారత రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బోధన్‌లోని అందాపూర్ కేజీబీవీ, అజాం గంజ్ హైస్కూల్‌లో విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగ విలువలు, పౌరుల బాధ్యతలపై వివరించి, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.

చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్, అధ్యక్షులు కోయేడి నర్సింహులు మాట్లాడుతూ మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. దెయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు వంటి వాటిని గుడ్డిగా నమ్మకుండా ప్రతి విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి, ప్రశ్నించి తెలుసుకోవాలని అన్నారు.

అలాగే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తూ “కూల్‌డ్రింక్స్ వద్దు.. మజ్జిగ, నిమ్మషర్బత్ ముద్దు” అనే నినాదంతో విద్యార్థులకు సందేశం ఇచ్చారు.

కార్యక్రమంలో సోషల్ వర్కర్ శ్రీనివాస్, కేజీబీవీ ఎస్‌వో హిమబిందు, సిబ్బంది వనిత, సవిత, అజాం గంజ్ హైస్కూల్ హెచ్‌ఎం చక్రధర్, సిబ్బంది రవీందర్, శిరీషతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more