కొండపైకి వెళ్లిన యువకుడిని కాపాడే క్రమంలో తండ్రి మృతి.. భర్త, కుమారుడిని చూసి తల్లి కూడా దుర్మరణం
ఛత్రపతి శంభాజీనగర్, ఆగస్టు 22: ఐఫోన్ ఈఎంఐ చెల్లింపు విషయంలో తలెత్తిన కుటుంబ కలహం విషాదాంతంగా మారింది. కుమారుడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి కొండపై నుంచి జారిపడి మృతి చెందగా.. కళ్ల ముందే భర్త, కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లి కూడా కొండపై నుంచి దూకి మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిక్గావ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల కునాల్ ఇటీవల ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఫోన్‌కు సంబంధించిన ఈఎంఐ వాయిదాలు చెల్లించేందుకు డబ్బులు అవసరం కావడంతో తండ్రి మురళీధర్ చాందుడేను డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన కునాల్ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి వాలూజ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కొండపైకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మురళీధర్, సంగీత అక్కడికి చేరుకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్ సంజయ్ జాధవ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు కూడా అక్కడికి చేరుకుని యువకుడిని కిందకు రావాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

దాదాపు మూడు గంటలపాటు కునాల్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు కిందకు వచ్చేందుకు అంగీకరించలేదని పోలీసులు తెలిపారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో మధ్యాహ్నం సమయంలో తండ్రి మురళీధర్ కుమారుడిని కాపాడేందుకు అతడి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి కొండ అంచు నుంచి కిందపడిపోయారు.
కళ్ల ముందే భర్త, కుమారుడు కిందపడటంతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి సంగీత కూడా కొండపై నుంచి కిందపడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురూ మృతి చెందారు.
ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు అక్కడి నుంచి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐఫోన్ ఈఎంఐ విషయంలో కుటుంబంలో జరిగిన గొడవే ఈ ఘటనకు దారితీసిందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







