-- --

సాలూరలో తహసీల్దార్‌ కార్యాలయానికి స్థల పరిశీలన

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సర్వే నంబర్ల వారీగా భూమి వివరాలు సేకరించిన ఆర్డీఓ విజయకుమారి

సాలూర, ఆగస్టు 22: నూతనంగా ఏర్పడిన సాలూర మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బోధన్‌ ఆర్డీఓ విజయకుమారి శుక్రవారం పరిశీలించారు. మండల తహసీల్దార్‌తో కలిసి అంగడి బజార్‌ ప్రాంతంలోని ప్రతిపాదిత స్థలాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణానికి గుర్తించిన స్థలం సాలూర మండల కేంద్రంలోని సర్వే నంబర్లు 1945, 1946, 1947, 1948లో మొత్తం 80 గుంటలు (రెండు ఎకరాలు) ఉన్నట్లు అధికారులు ఆర్డీఓకు వివరించారు. ఇందులో సర్వే నంబర్‌ 1945లో 25 గుంటలు, 1946లో 5 గుంటలు, 1947లో 36 గుంటలు, 1948లో 14 గుంటల విస్తీర్ణం ఉన్నట్లు తెలిపారు.

స్థల స్వరూపం, అందుబాటు, భవన నిర్మాణానికి అనుకూలత తదితర అంశాలను ఆర్డీఓ పరిశీలించారు. నూతన మండలానికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం సాలూర మండల కేంద్రంలోని SIR–2026 ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కూడా ఆర్డీఓ విజయకుమారి పరిశీలించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న ప్రక్రియ, సంబంధిత రికార్డులు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌, శంకర్‌, సర్వేయర్‌ శ్రవణ్‌కుమార్‌, గ్రామ పెద్దలు అల్లె రమేష్‌, సోక్కం రవి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more