ప్రైవేట్ ఉపాధ్యాయుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
ఉపాధ్యాయులపై దాడులను అరికట్టాలి: ట్రస్మా
రూపారెడ్డి హత్యను ఖండిస్తూ బోధన్‌లో భారీ ర్యాలీ
బోధన్, ఆగస్టు 21: ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) ప్రతినిధులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా శుక్రవారం బోధన్ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో ‘రూపారెడ్డి అమర్ రహే’ అంటూ నినాదాలు చేస్తూ, ప్రైవేట్ విద్యా రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లలు చెడు అలవాట్లు, వివిధ రకాల వ్యసనాలకు లోనుకాకుండా తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ, వారికి మంచి చెడులపై అవగాహన కల్పించాలని కోరారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెంచడం ద్వారా ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు.

ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి, వారి రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ట్రస్మా ప్రతినిధులు కోరారు.
కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, పట్టణ అధ్యక్షుడు హరికృష్ణతో పాటు పలువురు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







