-- --

SIR ఫేజ్–2పై బీజేపీ నేతల చర్చ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఆగస్టు 25న ఎంపీ అర్వింద్‌ జన్మదిన వేడుకల నిర్వహణపై సమాలోచన

నిజామాబాద్, ఆగస్టు 22: నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్‌రెడ్డి (ఎంఆర్‌పీ) మాట్లాడుతూ SIR ఫేజ్‌–2లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్లకు అవగాహన కల్పించడం, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంపై చర్చించారు. ఓటరు జాబితాలో మార్పులు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

అలాగే నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ జన్మదిన వేడుకలను ఆగస్టు 25న ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగా రెడ్డి, బోధన్‌ అసెంబ్లీ ఇంచార్జి వడ్డీ మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more