బెలాల్ గ్రామపంచాయతీ వ్యవహారంపై వార్త ప్రచురించిన నేపథ్యంలో ఫోన్ కాల్స్.. కలెక్టర్‌కు ఇచ్చిన లిఖిత ఫిర్యాదుల ఆధారంగానే కథనం ప్రచురించామని స్పష్టం చేసిన V1 న్యూస్ యాజమాన్యం
బెలాల్, జూలై 20:
బెలాల్ గ్రామపంచాయతీ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వార్తలు పలు పత్రికలు, డిజిటల్ మీడియా వేదికల్లో కూడా ప్రచురితమైనప్పటికీ, బెదిరింపులు మాత్రం V1 న్యూస్ యాజమాన్యానికే వస్తున్నాయని యాజమాన్యం పేర్కొంది.
గ్రామపంచాయతీకి చెందిన కొందరు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తమ వద్ద ఉన్న వివరాలతో పాటు జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ప్రతిని కూడా V1 న్యూస్ ప్రతినిధులకు చూపించారని యాజమాన్యం తెలిపింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, వారు అందించిన సమాచారం మరియు కలెక్టర్‌కు సమర్పించిన ఫిర్యాదు ప్రతిలో పేర్కొన్న అంశాల ఆధారంగానే వార్తను ప్రచురించినట్లు స్పష్టం చేసింది.

వార్త ప్రచురితమైన అనంతరం ఒక మొబైల్ నంబర్ నుంచి ఫోన్ చేసి, “ఈ వార్త ఎందుకు ప్రచురించారు?”, “మిమ్మల్ని కలవాలి”, “మీపై ఫిర్యాదు చేస్తాం”, “గ్రామ పరువు తీశారు” అంటూ హెచ్చరికలు చేస్తున్నట్లు V1 న్యూస్ యాజమాన్యం వెల్లడించింది.
ఇదే అంశంపై ఇతర మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురించినప్పటికీ, ఒక్క V1 న్యూస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు రావడం వెనుక కారణమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంది.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, వార్తలో పేర్కొన్న అంశాలు సంబంధిత వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు అందించిన సమాచారం మరియు జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగానే ప్రచురించబడినవేనని V1 న్యూస్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆరోపణలు వాస్తవమా కాదా అనేది సంబంధిత అధికారులు నిష్పాక్షిక విచారణ ద్వారా నిర్ధారించాల్సిన అంశమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో V1 న్యూస్ యాజమాన్యం జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులను కోరుతున్న అంశాలు:
- బెలాల్ గ్రామపంచాయతీపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ చేపట్టాలి.
- వార్త ప్రచురించినందుకు V1 న్యూస్ ప్రతినిధులను బెదిరిస్తున్నారనే ఫిర్యాదుపై కూడా విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
- ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడుతూ, విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులకు భద్రత కల్పించాలి
“నిజం రాసిన కలాన్ని బెదిరించవచ్చు… కానీ నిజాన్ని శాశ్వతంగా దాచలేరు.”
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








