-- --

జాడి జమాల్పూర్‌లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ.. 35 ఇళ్లు మంజూరుపై లబ్ధిదారుల హర్షం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నలుగురు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంచాయతీ కార్యదర్శి చేతుల మీదుగా భూమిపూజ.. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకుల పాల్గొనిక

బోధన్, జూలై 20 (వి1 న్యూస్):

బోధన్ మండలంలోని జాడి జమాల్పూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద గ్రామానికి మొత్తం 35 ఇళ్లు మంజూరుకావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం నలుగురు లబ్ధిదారుల ఇళ్ల స్థలాల వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ భూమిపూజ నిర్వహించి, ముగ్గు వేయించి గృహ నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు పార్టీలకు అతీతంగా ఇళ్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ, ప్రభుత్వం, ప్రభుత్వ సలహాదారులు तथा బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాపారు శ్రావణ్, వార్డు సభ్యులు షేక్ మజార్ అలీ, పులి ఆంజనేయులు, యాపారు గౌతమ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వైట్ల శ్రీనివాసరావు, వడ్డేటి రాజు, గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లవరపు సుందరరాజు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవదానయ్య మాదినేని, గ్రామ పంచాయతీ సిబ్బంది సంజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more