విద్యార్థుల అభ్యసనా ఫలితాల మెరుగుదలకు బోధనా నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ – 51 మంది ఉపాధ్యాయుల పాల్గొనడం
బోధన్, జూలై 20 (వార్త):
ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థుల అభ్యసనా ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో బోధన్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) అంశంపై మూడు రోజుల వృత్త్యాంతర శిక్షణ కార్యక్రమం సోమవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆజాంగాంజ్లో ప్రారంభమైంది.
మండల విద్యాధికారి శ్రీ నాగయ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణలో మొత్తం 51 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా పద్ధతులు, వినూత్న విధానాలు, నైపుణ్యాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా డి.ఆర్.పీలు శ్రీనివాస్ రెడ్డి మరియు రాజేష్ గణిత బోధనలో అనుసరించాల్సిన ప్రభావవంతమైన వ్యూహాలు, భాషా అభ్యాసంలో నైపుణ్యాభివృద్ధికి అవసరమైన బోధనా పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించారు. బోధనను మరింత ఫలవంతంగా తీర్చిదిద్దేందుకు విలువైన సూచనలు, సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్పీలు సంజీవ్, ప్రీతి, సందీప్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆజాంగాంజ్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు చక్రవర్తి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ నగేష్, సీఆర్పీలు విజయ్, యూసుఫ్, పాఠశాల ఉపాధ్యాయులు, శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







