-- --

సుద్దులం ఉపసర్పంచ్‌పై దాడిని ఖండించిన ఉపసర్పంచ్ ఫోరం.. డీపీఓకు వినతిపత్రం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

నిజామాబాద్, జూలై 20:
సుద్దులం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ చెవిటి నరేష్‌పై ఇటీవల జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్‌లో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వికార్ పాషా నాయకత్వంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఉపసర్పంచ్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొని నరేష్‌కు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ, ఉపసర్పంచ్ చెవిటి నరేష్‌పై జరిగిన దాడి తీవ్రంగా ఖండించదగ్గ సంఘటన అని పేర్కొన్నారు. కులాల పేరుతో దూషిస్తూ, గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగించడం, గ్రామ పంచాయతీ ఆర్థిక లావాదేవీల విషయంలో ఒత్తిళ్లు తెచ్చి సంతకాలు చేయించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

గ్రామ సర్పంచ్ తేనీటి హేమలత, ఆమె భర్త లక్ష్మణ్ రెడ్డి వ్యవహారాలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

అనంతరం జిల్లా పంచాయతీ అధికారిని (డీపీఓ) కలిసి ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

గమనిక: ఈ వార్తలో పేర్కొన్న ఆరోపణలు ఉపసర్పంచ్ ఫోరం నాయకులు చేసినవే. సంబంధిత వ్యక్తుల స్పందన అందిన వెంటనే ప్రచురించవచ్చు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more